కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయల్లో 14,967 (13,025 టీచింగ్, 1,942 నాన్ టీచింగ్) పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. డిసెంబర్ 4వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. పోస్టును బట్టి పీజీ, డిగ్రీ, B.ed, M.Ed, MCA, ME, M.Tech, M.PEd, BCA, BE, B.Tech, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు Kvsangathan.nic.in/ను విజిట్ చేయండి.
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS), నవోదయ విద్యాలయ సమితి (NVS) లకు వివిధ బోధన, బోధనేతర పోస్టుల నియామకాలను నిర్వహించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మొత్తం 14,967 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం ఖాళీలలో, 9126 ఖాళీలు కేంద్రీయ విద్యాలయ సంఘటన్, 5841 ఖాళీలు నవోదయ విద్యాలయ సమితిలో ఉన్నాయి.
మొదటిసారిగా సీబీఎస్‌ఈ కేవీఎస్, ఎన్వీఎస్‌లకు నియామక పరీక్ష మరియు ఎంపికను ఒకేసారి నిర్వహిస్తోంది, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), ప్రైమరీ టీచర్ (PRT), వివిధ అడ్మినిస్ట్రేటివ్ , నాన్-టీచింగ్ పాత్రలు వంటి విస్తృత శ్రేణి పోస్టులను కవర్ చేస్తుంది.