5,208 ప్రొబేషనరీ ఆఫీసర్స్/ మేనేజ్‌మెంట్ ట్రైనీస్ ఉద్యోగాల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ.. ఈ నెల 28వ తేదీన ముగియనుంది. ప్రిలిమినరీ, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా నియామక ప్రక్రియ ఉంటుంది. జులై 28, 2025 నాటికి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు.
సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలి. జులై 1, 2025 తేదీ నాటికి వయస్సు నుంచి 20 - 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు జీతం ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.175 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు ఐబీపీఎస్ వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.