నవోదయలో భారీగా నాన్ టీచింగ్ పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు
దేశంలోని నవోదయ విద్యాలయాల్లో బోధనేతర . 1,377 (నాన్ టీచింగ్) సిబ్బంది నియామకానికి గత నెలలో నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే.
By అంజి Published on 8 May 2024 11:21 AM GMTనవోదయలో భారీగా నాన్ టీచింగ్ పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు
దేశంలోని నవోదయ విద్యాలయాల్లో బోధనేతర . 1,377 (నాన్ టీచింగ్) సిబ్బంది నియామకానికి గత నెలలో నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా దరఖాస్తుల గడువును నవోదయ విద్యాలయ సమితి మరోసారి పొడిగించింది. నోటిఫికేషన్ ప్రకారం.. ఏప్రిల్ 30తో గడువు ముగియాల్సి ఉంది. ఇటీవల మే 7వరకు దరఖాస్తును గడువును పొడిగించారు. తాజాగా ఆ గడువును సైతం మే 14వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులు మే 14 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఉద్యోగ స్థాయిని బట్టి భారీ వేతనాలు ఇవ్వనున్నారు. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సవరించిన తేదీని గమనించి, అధికారిక వెబ్‌సైట్ navodaya.gov ద్వారా తమ దరఖాస్తులను సకాలంలో సమర్పించాలని అధికారులు సూచించారు. ఈ పొడిగింపు దరఖాస్తుదారులకు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి అదనపు సమయాన్ని అందిస్తుంది. సమర్పణకు ముందు అర్హత ప్రమాణాలను జాగ్రత్తగా పరిశీలించడానికి అనుమతిస్తుంది.
మేల్ స్టాఫ్ నర్స్ పోస్టులు 121 కాగా, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 5, ఆడిట్ అసిస్టెంట్ 12, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ 4, లీగల్ అసిస్టెంట్ 1, స్టెనోగ్రాఫర్ 23, కంప్యూటర్ ఆపరేటర్ 2, క్యాటరింగ్ సూపర్‌వైజర్ 78, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 381, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ 128, ల్యాబ్ అటెండెంట్ 161, మెస్ హెల్పర్ 442, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 19 చొప్పున పోస్టులను భర్తీ చేస్తారు. పోస్టును అనుసరించి 10వ తరగతి, 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని చేసిన అనుభవం ఉండాలి.
నవోదయ విద్యాలయ సమితి (NVS) అధికారిక వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి