Telangana: ప్రారంభమైన మెగా డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ
మెగా డీఎస్సీల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 4 March 2024 12:08 PM ISTTelangana: ప్రారంభమైన మెగా డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ
తెలంగాణలో గతంలో విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత మరిన్ని పోస్టులను కలుపుతూ మెగా డీఎస్సీని ప్రకటించింది. తాజాగా మెగా డీఎస్సీల దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. మెగా డీఎస్సీకి దరఖాస్తులను మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్ ద్వారా స్వీకరించనున్నారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
గతంలో 2023 సెప్టెంబర్‌లో 5,089 పోస్టులతో జారీ చేసిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దాన్ని రద్దు చేసిన తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఇటీవల 11,062 ఉద్యోగాలతో మెగా డీఎస్సీ ఇచ్చింది. సోమవారం నుంచే ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అభ్యర్ధులు https://tsdsc.aptonline.in/tsdsc/ దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. తొలుత పోస్టును ఎంచుకుని, నిర్దేశిత ఫీజు చెల్లించి Online Applications దరఖాస్తును పూర్తి చేయాలి. ఈ దరఖాస్తులను మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు స్వీకరిస్తారు. మెగా డీఎస్సీలో ఉన్న 11,062 ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 796 ఉద్యోగాలు ఉన్నాయి.
ఈ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌లోని ఖాళీల్లో.. హైదరాబాద్ జిల్లాలో ఎస్జీటీ పోస్టులు 537 అత్యధికంగా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో కేవలం 21 పోస్టు మాత్రమే ఉన్నాయి. ఇక స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అధికంగా ఖమ్మం జిల్లాలో 176 పోస్టులు ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో ఈ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 26 మాత్రమే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 74 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా ఎస్టీటీలు 209గా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో 383 ఎస్జీటీ ఖాళీలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 86 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా...224 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో 84 స్కూల్ అసిస్టెంట్ లు ఖాళీగా ఉంటే... 137 పోస్టులు ఎస్జీటీలు ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో చూస్తే...స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 99 ఉన్నాయి. ఎస్జీటీ ఉద్యోగాలు 161గా ఉన్నాయి.