టెన్త్ ఉత్తీర్ణులు అయిన వారికి డైరెక్ట్‌గా ఉద్యోగం పొందే అవకాశం పోస్టల్ శాఖ కల్పించింది. 44,228 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. దరఖాస్తు చేయడానికి ఆగస్టు 5 ఆఖరు తేదీ. ఇంట్రెస్ట్ గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగలరు. దరఖాస్తు సవరణకు ఆగస్టు 6 నుంచి 8 వరకు అవకాశం ఇచ్చారు. టెన్త్‌లో మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 981 పోస్టులు, ఆంధ్రప్రదేశ్‌లో 1355 పోస్టులు ఉన్నాయి.
అభ్యర్థులకు 18 నుంచి 40 ఏళ్ల వయసు ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. అభ్యర్థులకు కంప్యూటర్ నాలెడ్జ్, సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. మెరిట్ లిస్టులో ఎంపికైన వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం పోస్టులను కేటాయిస్తారు. ఉద్యోగానికి ఎంపికైన వారు బ్రాంచ్ పోస్టు మాస్టర్‌గా నెలకు రూ.12 వేల నుంచి రూ.29,380 వరకు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్, డాక్ సేవక్ పోస్టులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.24,470 వరకు జీతం పొందవచ్చు.