నిరుద్యోగులకు ముఖ్యగమనిక.. ఇండియన్ ఆర్మీలో నోటిఫికేషన్
నిరుద్యోగులకు ముఖ్య గమనిక. దేశానికి సేవ చేయాలని చాలా మంది యువత అనుకుంటూ ఉంటారు.
By Srikanth Gundamalla Published on 30 May 2024 6:48 AM GMTనిరుద్యోగులకు ముఖ్యగమనిక.. ఇండియన్ ఆర్మీలో నోటిఫికేషన్
నిరుద్యోగులకు ముఖ్య గమనిక. దేశానికి సేవ చేయాలని చాలా మంది యువత అనుకుంటూ ఉంటారు. ఇండియన్ ఆర్మీలో చేరాలని.. తద్వారా దేశ ప్రజలకు సంరక్షణగా నిలవాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం కావాలని అనుకుంటున్నవారికి ఇది శుభవార్త. షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్ పోస్టులకు ఆర్మీ రిక్రూట్‌మెట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. వెటర్నరీ గ్రాడ్యుయేట్స్ ఈ పోస్టులకు దఱకాస్తులు చేసుకోవచ్చు. మొత్తం 15 ఉద్యోగాలకు దరఖాస్తులు తీసుకుంటున్నారు. పురుషులకు 12 ఉద్యోగాలు కేటాయించగా.. మూడు ఖాళీలు మహిళల కోసం.
ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకునే అర్హులైన అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ https://www.joinindianarmy.nic.in/ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు జూన్ 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఇచ్చారు. ఆ తర్వాత అప్లికేషన్లు తీసుకోబోరు అని తెలుస్తోంది. ఇక ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారు కచ్చితంగా గుర్తింపు పొందిన సంస్థ నుంచి BVSc లేదా BVSc (ఆనర్స్) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయానికి ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి, ఆప్టిట్యూడ్ పరీక్షలో పాస్ అవ్వాలి.
షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్‌కు భారత పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని. వయసు విషయానికి వస్తే 2024 మే 20 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆఫ్‌లైన్ మోడ్‌లో పంపాలి. అప్లికేషన్‌ను ప్లెయిన్ పేపర్‌పై, సూచించిన ఫార్మాట్‌లో రాయాలి. ఎన్వలప్‌పై ‘Application for Short Service Commission in RVC’ అని ఉండాలి. అప్లికేషన్‌ను ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మీ వెటర్నరీ సర్వీసెస్, QMG బ్రాంచ్, ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ (ఆర్మీ), వెస్ట్ బ్లాక్ 3 గ్రౌండ్ ఫ్లోర్, వింగ్ 4, RK పురం, న్యూఢిల్లీ 110066.’ అనే అడ్రస్‌కు పంపించాలి.ఇక ఆ తర్వాత సెలక్షన్ ప్రాసెస్ మూడు దశలుగా ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ తర్వాత అభ్యర్థికి కెప్టెన్ హోదాలో సైన్యంలో షార్ట్ టర్మ్ సర్వీస్ పోస్టు ఇస్తారు.