నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. 172 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Job Notification for 172 Junior Panchayat Secretary posts.తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. పంచాయతీరాజ్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  18 Sept 2021 9:11 AM IST
నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. 172 జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. పంచాయతీరాజ్ శాఖలో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. స్పోర్ట్స్ కోటాలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మొత్తం 172 ఖాళీలను ప్ర‌క‌టించింది. ఈ పోస్టుల‌కు నేటి(సెప్టెంబ‌ర్ 18) నుంచి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబ‌ర్ 10, 2021 చివ‌రి తేదీ. ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు కాబ‌ట్టి.. విద్యార్హల‌తో పాటు ప‌లు క్రీడ‌ల్లో రాణించి ఉండాలి.

అర్హతలు: డిగ్రీ పాసై ఉండాలి, స్పోర్ట్స్ కోటా గైడ్‌లైన్స్ పూర్తి చేయాలి

వయసు: 18 నుంచి 44 ఏళ్లు

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 18, 2021

దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 10,2021

దరఖాస్తు ఫీజు : జనరల్, బీసీ క్రీమీలేయర్ కేటగిరీ అభ్యర్థులకు రూ.800. ఎస్సీ, ఎస్టీ, బీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు రూ.400.

ఎంపిక విధానం : రాతపరీక్ష (100 మార్కులకు ఒకటి చొప్పున 2 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్లో 35 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు.)

పరీక్షా కేంద్రాలు : హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇవే..

ఆదిలాబాద్-6, భద్రాద్రి కొత్తగూడెం-7, జగిత్యాల-5, జనగామ 4, జయశంకర్ భూపాలపల్లి 6, గద్వాల 3, కామారెడ్డి 8, కరీంనగర్ 4, ఖమ్మం 9, ఆసిఫాబాద్ 4, మహబూబాబాద్ 7, మహబూబ్ నగర్, నారాయణపేట 10, మంచిర్యాల 4, మెదక్ 6, నాగర్‌కర్నూలు 6, నల్గొండ 13, నిర్మల్ 6, నిజామాబాద్ 8, పెద్దపల్లి 3, సిరిసిల్ల 3, రంగారెడ్డి 7, సంగారెడ్డి 8, సిద్దిపేట 6, సూర్యాపేట 6, వికారాబాద్ 8, వనపర్తి 3, వరంగల్ రూరల్ 5, వరంగల్ అర్బన్ 1, యాదాద్రి భువనగిరి 6.

Next Story