ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో) ఫ్రెషర్ల రిక్రూట్‌మెంట్ పుంజుకునే ఛాన్స్ ఉంది. 2025 - 2026 ఫైనాన్షియల్ ఇయర్‌లో కొత్తగా 1,50,000 మందిని ఐటీ కంపెనీలు రిక్రూట్ చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్‌తో పోలిస్తే దాదాపు రెట్టింపు నియామకాలు జరగనున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ రిక్రూటింగ్ సంస్థ టీమ్‌లీజ్ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే నాటికి ఐటీలో కొత్త వారి నియామకాల సంఖ్య 85 వేల నుంచి 95 వేలకు చేరే ఛాన్స్ ఉంది.
రానున్న ఫైనాన్షియల్ ఇయర్‌లో దీని సంఖ్య రెట్టింపు కానుంది. కాగ్నిజెంట్, క్యాప్ జెమిని, యాక్సెంచర్ వంటి ప్రముఖ ఐటీ కంపెనీలు భారీగా ఎత్తున 1,60,000 నుంచి 1,80,000 మంది వరకు కొత్త వారిని రిక్రూట్ చేసుకునే ఛాన్స్ ఉందని రీసెర్చ్ అండ్ డేటా సంస్థ అయిన అన్‌ఎర్త్‌సైట్ అంచనా వేసింది. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్‌లో ఐటీ కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగ కోతలు చేపట్టిన విషయం తెలిసిందే. జాబ్ రిక్రూట్‌మెంట్‌లో ఐటీ కంపెనీలు ఆచితూచి వ్యవహారించాయి.
అయితే రాబోయే ఆర్థిక సంవత్సరంలో కొత్త వారి నియామకాలు కొంత మేర పెరగనున్నాయి. చాలా ఐటీ సంస్థలు శ్రామిక శక్తిని, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ రోల్స్‌లో నియమించుకునేందుకు ఎదురుచూస్తున్నాయి. ఈ స్కిల్స్‌తో తాజాగా డిగ్రీ పూర్తి చేసుకుని వచ్చే వారిని రిక్రూట్ చేసుకునేందుకు ఐటీ కంపెనీలు ఎదురుచూస్తున్నాయని టీమ్‌లీజ్ తెలిపింది.