టెన్త్ అర్హతతో 28,636 ఉద్యోగాలు.. కరెక్షన్ విండో ఓపెన్.. నేడు ఒక్కరోజే ఛాన్స్
భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ, దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 28,636 గ్రామీణ్ డాక్ సేవక్...
By - అంజి |
టెన్త్ అర్హతతో 28,636 ఉద్యోగాలు.. కరెక్షన్ విండో ఓపెన్.. నేడు ఒక్కరోజే ఛాన్స్
భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ, దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 28,636 గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసింది. వీటిలో తెలంగాణలో 608, ఆంధ్రప్రదేశ్‌లో 1060 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 16తో ముగియగా, అభ్యర్థులు తమ అప్లికేషన్లలో చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు (Correction Window) పోస్టల్ శాఖ అవకాశం కల్పించింది.
ఎడిట్ ఆప్షన్ వివరాలు
దరఖాస్తు చేసుకున్న సమయంలో పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు లేదా ఫోటో/సంతకం వంటి వివరాల్లో తప్పులు దొర్లితే వాటిని సవరించుకోవడానికి ఈ విండో ఉపయోగపడుతుంది. అభ్యర్థులు నేడు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు https://www.indiapost.gov.in/ సైట్‌లో ఎడిట్ చేసుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్: అభ్యర్థులు https://www.indiapost.gov.in/సందర్శించి తమ రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. మొదట అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. హోమ్ పేజీలో ఉన్న 'Correction Window' లేదా 'Edit Application' లింక్‌పై క్లిక్ చేయండి. మీ రిజిస్ట్రేషన్ నంబర్ మరియు మొబైల్ నంబర్‌కు వచ్చే OTPని ఎంటర్ చేయండి. తప్పుగా ఉన్న వివరాలను సరిచేసి, 'Preview' చూసుకున్న తర్వాత సబ్మిట్ చేయండి. సవరించిన అప్లికేషన్ ఫారమ్‌ను భవిష్యత్తు అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.
గమనిక: నేడు సాయంత్రం 5 గంటల తర్వాత ఎటువంటి మార్పులకు అవకాశం ఉండదు. సర్వర్ రద్దీ పెరగకముందే అభ్యర్థులు తమ వివరాలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.