నిరుద్యోగులకు అలర్ట్‌.. 28,740 పోస్టులు.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన పోస్టల్ డిపార్ట్‌మెంట్ దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న...

By -  అంజి
Published on : 14 Feb 2026 7:59 AM IST

India Post GDS Recruitment 2026, Gramin Dak Sevak Jobs, GDS Online Application Last Date, Post Office Jobs without Exam, 10th Pass Govt Jobs, BPM ABPM Vacancies

నిరుద్యోగులకు అలర్ట్‌.. 28,740 పోస్టులు.. దరఖాస్తుకు నేడే చివరి తేదీ 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన పోస్టల్ డిపార్ట్‌మెంట్ దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 28,740 గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ABPM) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన దరఖాస్తు గడువు నేటితో (ఫిబ్రవరి 14) ముగియనుంది. ఈ భారీ నోటిఫికేషన్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 1,668 పోస్టులు ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్: 1,060 పోస్టులు, తెలంగాణ: 608 పోస్టులు ఉన్నాయి. పూర్తి వివరాలకు https://indiapostgdsonline.gov.in/ విజిట్‌ చేయండి. గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (టెన్త్) ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాషపై అవగాహన తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయోసడలింపు వర్తిస్తుంది. కంప్యూటర్ పరిజ్ఞానం, సైకిల్ తొక్కడం రావడం అదనపు అర్హతలుగా పరిగణిస్తారు.

అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఇంటర్వ్యూలు కూడా నిర్వహించరు. కేవలం పదో తరగతిలో వచ్చిన మెరిట్ మార్కుల (GPA) ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మార్కులు సమానంగా ఉన్నప్పుడు వయస్సును పరిగణనలోకి తీసుకుంటారు. ఎంపికైన అభ్యర్థులు పోస్టును బట్టి నెలకు రూ. 10,000 నుంచి రూ. 29,380 వరకు వేతనం అందుకుంటారు. ఇది కాకుండా ఇన్సెంటివ్‌లు కూడా పొందే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే వారికి ఇది మంచి జీవనోపాధిని అందిస్తుంది.

ఇండియా పోస్ట్ GDS రిక్రూట్‌మెంట్ 2026: దరఖాస్తు దశలు

- అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి: indiapostgdsonline.gov.in

- ప్రాథమిక వ్యక్తిగత, విద్యా వివరాలను పూరించడం ద్వారా నమోదు చేసుకోండి

- ఆన్‌లైన్ ఫారమ్‌ను సరైన సమాచారంతో నింపండి.

- అవసరమైన పత్రాల స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయండి.

- దరఖాస్తు రుసుము చెల్లించి ఫారమ్‌ను సమర్పించండి

- భవిష్యత్ ఉపయోగం కోసం అప్లికేషన్‌ను సేవ్ చేయండి లేదా ప్రింట్ చేయండి.

Next Story