పోస్టాఫీసు జీడీఎస్ మెరిట్ జాబితా విడుదల.. ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి!
ఇండియా పోస్ట్ (భారత ప్రభుత్వ తపాలా శాఖ) గ్రామీణ డాక్ సేవక్ (GDS) జనవరి 2026 రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి తొలి మెరిట్...
By - అంజి |
పోస్టాఫీసు జీడీఎస్ మెరిట్ జాబితా విడుదల.. ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి!
ఇండియా పోస్ట్ (భారత ప్రభుత్వ తపాలా శాఖ) గ్రామీణ డాక్ సేవక్ (GDS) జనవరి 2026 రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి తొలి మెరిట్ జాబితాను అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 28,636 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ఈ ప్రక్రియలో భాగంగా ఎంపికైన అభ్యర్థుల వివరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీసుల్లో 28,740 బీపీఎం, జీడీఎస్, ఏబీపీఎం పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ షార్ట్‌లిస్ట్‌ను పోస్టాఫీసు వెబ్‌సౌట్‌లో అందుబాటులో ఉంచింది. రాతపరీక్ష లేకుండా పదో తరగతిలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 23లోపు ఒరిజినల్ డాక్యుమెంట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో 1,060, తెలంగాణలో 608 ఉద్యోగాలు ఉన్నాయి. పోస్టును బట్టి రూ.10 వేల నుంచి రూ.29,380గా శాలరీ ఉంటుంది.
మెరిట్ జాబితాను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
- అధికారిక వెబ్‌సైట్ indiapostgdsonline.gov.in సందర్శించండి.
- హోమ్ పేజీలో "Selection List" లేదా "1st Merit List 2026" లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ రాష్ట్రం (ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ) ఎంచుకోండి.
- మెరిట్ జాబితా PDF రూపంలో డౌన్‌లోడ్ అవుతుంది.
- అందులో మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉందో లేదో సరిచూసుకోండి (Ctrl+F ఉపయోగించి వెతకవచ్చు).
తర్వాతి దశ:
మెరిట్ జాబితాలో పేరున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లతో డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) కోసం సిద్ధంగా ఉండాలి. నిర్ణీత సమయంలోగా వెరిఫికేషన్ పూర్తి చేయని పక్షంలో అభ్యర్థిత్వం రద్దవుతుంది.