10వేల‌కు పైగా బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్

IBPS released notification with over 10000 posts.బ్యాంకు ఉద్యోగం కావాల‌నుకుంటున్నారా..? అయితే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jun 2021 7:46 AM GMT
10వేల‌కు పైగా బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్

బ్యాంకు ఉద్యోగం కావాల‌నుకుంటున్నారా..? అయితే ఇది మీకోస‌మే. దేశవ్యాప్తంగా ఉన్న రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో (ఆర్‌ఆర్‌బీ) 10,000 పైగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఆఫీసర్ స్కేల్ 1 (ప్రొబెషనరీ ఆఫీసర్), మల్టీపర్పస్ (క్లర్క్), ఆఫీసర్ స్కేల్ 2, ఆఫీసర్ స్కేల్ 3 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) 5076, ఆఫీసర్‌ స్కేల్‌-1 (అసిస్టెంట్‌ మేనేజర్‌) 4206, ఆఫీసర్‌ స్కేల్‌-2 (మేనేజర్‌, ఐటీ ఆఫీసర్‌, సీఏ) 1060, ఆఫీసర్‌ స్కేల్‌-3 పోస్టులు 156 చొప్పున ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కూడా ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి కలిగినవారు ఈనెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా

పరీక్ష ఫీజు: రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.175

దరఖాస్తులు ప్రారంభం: జూన్‌ 8

దరఖాస్తులకు చివరితేదీ: జూన్‌ 28

అడ్మిట్‌ కార్డు: జూలై లేదా ఆగస్టులో

ప్రిలిమ్స్‌ ఎగ్జామ్‌: ఆగస్టు 1 నుంచి 21 మధ్య

ఫలితాలు: సెప్టెంబర్‌లో

స్కేల్‌ 2, 3 రాతపరీక్ష: సెప్టెంబర్‌ 25

పీఓ మెయిన్స్‌ ఎగ్జామ్‌: సెప్టెంబర్‌ 25

క్లర్క్‌ మెయిన్స్‌ ఎగ్జామ్‌: అక్టోబర్‌ 3

ఆఫీసర్‌ స్కేల్‌-2, 3 ఇంటర్వ్యూ: అక్టోబర్‌ లేదా నవంబర్‌లో

ప్రొవిజనల్ అలాట్‌మెంట్ : 2022 జనవరి

Next Story