Govt Jobs: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీ ఉద్యోగాలు.. ఇప్పుడే అప్లై చేయండి.. పూర్తి వివరాలు ఇక్కడ..

ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ)లో 362 మల్టీ టాస్కింగ్‌ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్‌ అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

By -  అంజి
Published on : 14 Dec 2025 9:35 AM IST

Huge jobs, central government departments, Jobs Apply , unemployed

Govt Jobs: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో భారీ ఉద్యోగాలు.. ఇప్పుడే అప్లై చేయండి.. పూర్తి వివరాలు ఇక్కడ

ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో పోస్టులు

ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ)లో 362 మల్టీ టాస్కింగ్‌ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్‌ అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్‌, మెయిన్స్‌ (టైర్‌ 1, టైర్‌ 2) ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 వరకు ఉంటుంది. వెబ్‌సైట్‌: mha.gov.in లో పూర్తి వివరాలు ఉంటాయి.

స్టీల్‌ అథారిటీ ఇండియాలో ఉద్యోగాలు

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌ఏఐఎల్‌)లో124 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ ఓస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 28 ఏళ్లు. రిజర్వేషన్‌ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. రాతపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1050, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీలకు రూ.300. వెబ్‌సైట్‌: www:sail.co.in

మంగళగిరి ఎయిమ్స్‌లో 76 పోస్టులు

ఎయిమ్స్‌ మంగళగిరిలో 76 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హత గల వారు జనవరి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎండీ/ఎంఎస్‌/ డీఎన్‌బీ/ డీఎమ్‌/ఎంసీహెచ్‌, ఎంఎస్సీ, ఎం బయోటెక్‌, పీహెచ్‌డీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 45 ఏళ్లు. రిజర్వేషన్‌ గల వారికి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.1500. జనవరి 6 నుంచి 8 వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వెబ్‌సైట్‌: https://www.aiimsmangalagiri.edu.in

హైదరాబాద్ ESICలో 102 పోస్టులు

హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని ఈఎస్‌ఐసీ ఆస్పత్రిలో 102 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ రిలీజైంది. అర్హత గల వారు డిసెంబర్‌ 29 నుంచి జనవరి 7 వరకు ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్‌, ఎంసీహెచ్‌/డీఎం/ డీఎన్‌బీ/ ఎండీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెలకు రూ.2.56 లక్షల, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1.70 లక్షలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.1.46 లక్షలు చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్‌ https://esic.gov.in

IAFలో 144 పోస్టులు

ఐఏఎఫ్‌.. 144 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్‌ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ అర్హత గల అభ్యర్థులు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.10,500 స్టైఫండ్‌ ఇస్తారు. వెబ్‌సైట్‌:https://indianairforce.nic.in/

IMDలో 134 పోస్టులు

భారత వాతావరణ శాఖ (ఐఎండీ)లో 134 ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి ఎంఎస్సీ, బీఈ, బీటెక్‌, పీహెచ్‌డీ, ఎంఈ, ఎంటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. స్క్రీనింగ్‌, షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్‌: https://mausam.imd.gov.in/

Next Story