3,058 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్
రైల్వేలో 3,058 ఎన్టీపీసీ (యూజీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. వీటిలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్,..
By - అంజి |
3,058 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్
రైల్వేలో 3,058 ఎన్టీపీసీ (యూజీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. వీటిలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ తదితర పోస్టులు ఉన్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులై ఉండి, 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ గల వారికి వయస్సులో సడలింపు ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
భారతీయ రైల్వేలలోని వివిధ అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం రైల్వే బోర్డు అక్టోబర్ 27, 2025న అధికారికంగా RRB NTPC ఇంటర్ లెవల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2025ను విడుదల చేసింది. ఈ RRB NTPC అండర్ గ్రాడ్యుయేట్ రిక్రూట్‌మెంట్ 2025 3058 ఖాళీలను భర్తీ చేయనుంది. ఇది 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. RRB NTPC రిక్రూట్‌మెంట్ 2025లోని అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులలో జూనియర్ క్లర్క్, ట్రైన్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ మరియు టికెట్ క్లర్క్ వంటి పోస్టులు ఉన్నాయి.
అర్హులై ఉండి ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 4వ తేదీ అర్ధరాత్రి 12 గంటల లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము చెల్లింపుకు చివరి తేదీ 6 డిసెంబర్ 2025. దిద్దుబాట్ల కోసం సవరణ విండో తేదీలు 7 డిసెంబర్ 2025 నుండి 16 డిసెంబర్ 2025 వరకు అందుబాటులో ఉంటాయి. https://www.rrbcdg.gov.in /ను విజిట్ చేయండి.