సివిల్ సర్వీసెస్ 2020 ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) విడుదల చేసింది. మెయిన్స్ పరీక్షకు సంబంధించిన ఫలితాలు మార్చి23, 2021న వెలువడ్డాయి. ఇంటర్వ్యూలను ఏప్రిల్ 4, 2021 నుంచి నిర్వహించాలని బావించగా.. దేశంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో వాయిదా వేసింది. తాజాగా పరిస్థితులను సమీక్షించిన యూపీఎస్‌సీ ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 22 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
సివిల్ సర్వీసెస్ ప్రీ అండ్ మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ www.upsc.gov.in ద్వారా ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను చూడొచ్చు.యూపీఎస్‌సీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్ లెటర్ త్వరలో జారీ చేయనున్నారు. ఇంటర్వ్యూలు ఉదయం, సాయంత్రం రెండు సెషన్లలో జరగనున్నాయి. మొదటి సెషన్ ఉదయం 9 నుంచి, రెండవ సెషన్ మధ్యాహ్నం 1 నుంచి ప్రారంభమవుతాయి. పర్సనాలిటీ టెస్ట్ లెటర్‌లో అభ్యర్థులు ఇంటర్వ్యూకి ఏ సమయంలో హాజరు కావాలో వెల్లడిస్తారు.