పదో తరగతి అర్హతతో 39వేల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.

By Srikanth Gundamalla  Published on  6 Sep 2024 3:00 AM GMT
పదో తరగతి అర్హతతో 39వేల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగాల జాతరకు తెరలేపింది. పదో తరగతి అర్హతతో 30వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్ర సాయుధ బలగాల్లోని వివిధ విభాగాల్లో మొత్తం 39,481 కానిస్టేబుల్‌ (జీడీ) పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే.. దరఖాస్తు రుసుము మాత్రం అక్టోబర్ 15వ తేదీ రాత్రి 11 గంటల వరకు చెల్లించేందుకు ఎస్‌ఎస్‌సీ అవకాశం కల్పించింది.

ఈ ఉద్యోగాల కోసం పరీక్ష ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించనున్నారు. జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే కాకుండా, తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీ భాషల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. కేంద్ర సాయుధ బలగాలు (సీఆర్పీఎఫ్) తో పాటు ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ (రైఫిల్ మ్యాన్) నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విభాగాల్లో ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఒకేసారి 39వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తుండటంతో నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కొరకు ఈ లింక్ ను క్లిక్ చేయండి.

Next Story