కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2,049 ఉద్యోగాలు..దరఖాస్తు చేసుకోండి..
కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
By Srikanth Gundamalla Published on 27 Feb 2024 4:23 PM ISTకేంద్ర ప్రభుత్వ శాఖల్లో 2,049 ఉద్యోగాలు..దరఖాస్తు చేసుకోండి..
కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు అధికారులు. ఈ మేరకు ఆయా శాఖల్లోని మొత్తం 2,049 పోస్టులను భర్తీ చేసేందుకు.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారి నుంచి ఆన్‌లైన్‌లో https://ssc.gov.in/ దరఖాస్తులు స్వీకరిస్తోంది. కాగా.. ఆయా ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత ఉన్నవారి వరకు అవకాశాలు ఉన్నాయి.
ఫిబ్రవరి 26 నుంచే ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. మార్చి 18వ తేదీ వరకు ఇది కొనసాగుతుంది. అలాగే ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు 19వ తేదీ వరకు గడువు ఉంటుంది. దరఖాస్తుల్లో సవరణలు చేసుకునేందుకు మార్చి 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నారు. ఇక ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు కనీసం 18 ఏళ్ల నుంచి గరిష్టంగా 30 ఏళ్ల లోపు వారు అర్హుల అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కేటగిరీల వారీగా వయసు సడలింపులనూ కల్పించారు.
ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలు, ఎక్స్ సర్వీస్‌మెన్లకు మూడేళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయో సడలింపులు ఇచ్చారు. దరఖాస్తు రుసుము అయితే.. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్తులకు రూ.100 గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీలకు చెందిన వారికి దరఖాస్తు రుసుము నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇక ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. మే 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కంప్యూటర్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. ఇక తప్పు సమాధానానికి అర మార్కు కోత కూడా ఉండనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు.
ఇక ఉద్యోగ ఖాళీలు.. హోదా, విద్యార్హతలు, వేతనం సహా ఇతర వివరాలకు లింక్‌పై క్లిక్ చేయండి.