నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. 10,811 CAG(కాగ్‌) ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ జారీ

CAG Recruitment 2021 Auditor Accountant posts.నిరుద్యోగుల‌కు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్‌) శుభ‌వార్త చెప్పింది. 10,811 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  27 Jan 2021 10:56 AM GMT
CAG Recruitment 2021 Auditor Accountant posts.

నిరుద్యోగుల‌కు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(కాగ్‌) శుభ‌వార్త చెప్పింది. 10,811 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఇందులో ఆడిటర్ పోస్టులు 6409 కాగా.. అకౌంటెంట్ పోస్టులు 4402. ఈ పోస్టుల‌కు బ్యాచిల‌ర్ డిగ్రీ ఉన్న‌వారు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అభ్య‌ర్థి వ‌య‌సు 18 నుంచి 27 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు రూ. 29,200 నుంచి రూ.92,300 వరకు వేతనం అంద‌నుంది. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు ప్రొహిబిషన్ పిరియడ్ ఉంటుంది.

ఇందులో ఏపీలో 144ఆడిట‌ర్ పోస్టులు ఉండ‌గా.. తెలంగాణ‌లో 220 పోస్టులు ఉన్నాయి. ఇక ఏపీలో 120 అకౌంటెంట్ పోస్టులు ఉండ‌గా.. తెలంగాణ‌లో 132 పోస్టులు ఉన్నాయి. అర్హులైన అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే వారు అధికారిక వెబ్ సైట్ https://cag.gov.in/en లోకి వెళ్లి CAG ఆడిట‌ర్‌, అకౌంటెంట్ ద‌ర‌ఖాస్తు ఫారం 2021ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ ఫార‌మ్‌ను నింపి ఇచ్చిన చిరునామాకి 19 ఫిబ్ర‌వ‌రి 2021 లోపు పంపాలి.

సంస్థ పేరు: కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా

పోస్టు పేరు: ఆడిటర్ మరియు అకౌంటెంట్

పోస్టుల సంఖ్య: 10811

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత

వయస్సు: 18 ఏళ్ల నుంచి 27 ఏళ్లు

జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా

దరఖాస్తుకు చివరి తేదీ: 19 ఫిబ్రవరి 2021

మ‌రిన్ని వివ‌రాల కోసం cag.gov.in వెబ్‌సైట్‌ను చూడగ‌ల‌రు.


Next Story