బీఎస్‌ఎఫ్‌లో 3,588 పోస్టులు.. నేడే చివరి తేదీ

బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)లో కానిస్టేబుల్‌ ట్రేడ్స్‌మన్ రిక్రూట్‌మెంట్ పోస్టుల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ.

By అంజి
Published on : 23 Aug 2025 6:52 AM IST

BSF, Tradesman Recruitment 2025, 3588 Constable Posts

బీఎస్‌ఎఫ్‌లో 3,588 పోస్టులు.. నేడే చివరి తేదీ

బార్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)లో కానిస్టేబుల్‌ ట్రేడ్స్‌మన్ రిక్రూట్‌మెంట్ పోస్టుల దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. తప్పుల సవరణకు రేపు, ఎల్లుండి అవకాశం కల్పించారు. కుక్‌, వాటర్‌ సప్లయర్‌, వాషర్‌, టైలర్‌, కార్పెంటర్‌, ప్లంబర్‌, బార్బర్‌, స్వీపర్‌, ఎలక్ట్రీషియన్‌ తదితర ట్రేడ్లలో 3,588 జాబ్స్‌ భర్తీ చేయనుంది. మెన్‌కు 3,406, ఉమెన్‌కు 182 పోస్టులను కేటాయించింది. 10వ తరగతి పాసై ఐటీఐ సర్టిఫికెట్‌ ఉన్నవారు అర్హులు. వయసు 18 నుంచి 25 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.

rectt.bsf.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు, అధికారిక బీఎస్‌ఎఫ్‌ వెబ్‌సైట్‌లో అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ, శారీరక ప్రమాణాలు, ముఖ్యమైన తేదీలను తనిఖీ చేయడం ఉత్తమం. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫారమ్ నింపేటప్పుడు సాంకేతిక సమస్యలను నివారించడానికి చివరి తేదీకి ముందే తమ ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.21 వేల నుంచి రూ.69 వేలకు జీతం ఉంటుంది.

Next Story