APPLY NOW: ఆర్‌ఆర్‌బీలో 22,195 పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) 22,195 గ్రూప్ డీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
By - అంజి |
APPLY NOW: ఆర్‌ఆర్‌బీలో 22,195 పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా
రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) 22,195 గ్రూప్ డీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఐటీఐ అర్హత గల వారు మార్చి 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.18 వేలు చెల్లిస్తారు. సీబీటీ, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు రూ.250. పూర్తి వివరాలుకు https://www.rrbcdg.gov.in/ విజిట్ చేయండి.
దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ ఉన్నవారికి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో ఉంటుంది. సీబీటీ విధానంలో పరీక్ష ఉంటుంది. గణితం, సైన్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ నుండి ప్రశ్నలు ఉంటాయి. తెలుగు భాషలో కూడా పరీక్ష రాయవచ్చు. ప్రతి తప్పుకు ఒక నెగటివ్ మార్క్ ఉంటుంది. సీబీటీ తర్వాత పీఈటీ ఉంటుంది. ఇందులో వెయిట్ లిఫ్టింగ్ టాస్క్, రన్నింగ్ ఉంటాయి. ఆ తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. రైల్వే ప్రమాణాల ప్రకారం అభ్యర్థుల ఆరోగ్య రికార్డులను చెక్ చేస్తారు. జీతంతో పాటు ఇతర అలవెన్సులు, బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
RRB గ్రూప్ D రిక్రూట్‌మెంట్ 2026 కి ఎలా దరఖాస్తు చేయాలి
- అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ దశలను అనుసరించవచ్చు:
- rrbapply.gov.in వద్ద అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
- నోటిఫికేషన్‌లో ఇవ్వబడిన అర్హత నిబంధనలను చదవండి.
- ఆన్‌లైన్ ఫారమ్‌లో వ్యక్తిగత, విద్యా వివరాలను పూరించండి.
- అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి
- దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించండి.
- ఫారమ్‌ను సమర్పించి, భవిష్యత్ ఉపయోగం కోసం కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.