నిరుద్యోగులకు శుభవార్త.. 22 వేల పోస్టులు.. ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ

నిరుద్యోగులకు ఆర్‌ఆర్‌బీ (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు) గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ జారీ చేసిన 22 వేల గ్రూప్‌ డి ఉద్యోగాలకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.

By -  అంజి
Published on : 31 Jan 2026 12:27 PM IST

job Applications, RRB Group D, jobs, rrbsiliguri, unemployed

నిరుద్యోగులకు శుభవార్త.. 22 వేల పోస్టులు.. ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ  

నిరుద్యోగులకు ఆర్‌ఆర్‌బీ (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు) గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్‌ జారీ చేసిన 22 వేల గ్రూప్‌ డి ఉద్యోగాలకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. మార్చి 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పాయింట్స్‌మెన్‌, అసిస్టెంట్‌, ట్రాక్‌ మెయింటెయినర్‌, అసిస్టెంట్‌ లోకోషెడ్‌, అసిస్టెంట్‌ ఆపరేషన్స్‌ తదితర ఖాళీలకు పదో తరగతి, ఐటీఐ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు 1-1-2026 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రారంభ వేతనం రూ.22 వేలు ఉంటుంది.

పూర్తి వివరాలకు rrbsiliguri.gov.in ను విజిట్‌ చేయండి. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాల్సి ఉంటుంది. 10వ తరగతి లేదా ITI పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అర్హులు. 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి (రిజర్వేషన్ ఉన్నవారికి వయో సడలింపు ఉంటుంది). అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో ఉంటుంది. సీబీటీ విధానంలో పరీక్ష ఉంటుంది. గణితం, సైన్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ నుండి ప్రశ్నలు ఉంటాయి.

తెలుగు భాషలో కూడా పరీక్ష రాయవచ్చు. ప్రతి తప్పుకు ఒక నెగటివ్ మార్క్ ఉంటుంది. సీబీటీ తర్వాత పీఈటీ ఉంటుంది. ఇందులో వెయిట్ లిఫ్టింగ్ టాస్క్, రన్నింగ్ ఉంటాయి. ఆ తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. రైల్వే ప్రమాణాల ప్రకారం అభ్యర్థుల ఆరోగ్య రికార్డులను చెక్‌ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 22,500 నుండి రూ. 25,380 వరకు జీతం ఉంటుంది. జీతంతో పాటు ఇతర అలవెన్సులు, బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అర్హతగల అభ్యర్థులు రైల్వే అధికారిక వెబ్‌సైట్ www.rrbapply.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు రూ. 250 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు.


Next Story