భారతీయ రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. టెన్త్‌తో పాటు ఐటీఐ, ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా పూర్తి చేసిన వారు అర్హులు. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. మొత్తం పోస్టుల్లో దక్షిణ మధ్య రైల్వేలో 989 పోస్టులు ఉన్నాయి. రిజర్వేషన్ బట్టి సడలింపు ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు https://indianrailways.gov.in/ లో ఉంటాయి.
ఫస్ట్ స్టేజ్ సీబీటీ, సెకండ్ స్టేజ్ సీబీటీ, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు ఫీజు రూ.500, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.250. కాగా ఆధార్ ధృవీకరించబడని దరఖాస్తుల కోసం నియామక ప్రక్రియ యొక్క ప్రతి దశలోనూ ప్రత్యేక వివరణాత్మక పరిశీలన కారణంగా కలిగే అసౌకర్యం, అదనపు జాప్యాన్ని నివారించడానికి అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తును పూరించేటప్పుడు ఆధార్ ఉపయోగించి వారి ప్రాథమిక వివరాలను ధృవీకరించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.