ఐబీలో 4,987 పోస్టులు.. దరఖాస్తుకు నేడు ఆఖరు

ఇంటలిజెన్స్‌ బ్యూరోలో టెన్త్‌ అర్హతతో 4,987 పోస్టులకు దరఖాస్తు గడువు నేటితో (ఆగస్టు 17) ముగియనుంది

By అంజి
Published on : 17 Aug 2025 7:16 AM IST

application deadline, 4987 posts, Intelligence Bureau ,Jobs

ఐబీలో 4,987 పోస్టులు.. దరఖాస్తుకు నేడు ఆఖరు

ఇంటలిజెన్స్‌ బ్యూరోలో టెన్త్‌ అర్హతతో 4,987 పోస్టులకు దరఖాస్తు గడువు నేటితో (ఆగస్టు 17) ముగియనుంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాంతీయ భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి, ఇంటెలిజెన్స్‌ పనిలో ఫీల్డ్‌ అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. అభ్యర్థులను రాతపరీక్ష (టైర్‌-1), డిస్క్రిప్టివ్‌ (టైర్‌-2), ఇంటర్వ్యూ (టైర్‌-3), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం

100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం గంట. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. జనరల్‌ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ ఆప్టిట్యూడ్‌, న్యూమరికల్‌/ అనలిటికల్‌/ లాజికల్‌ ఎబిలిటీ అండ్‌ రీజనింగ్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ స్టడీస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి.. డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ 50 మార్కులకు (అర్హత పరీక్ష) నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి గంట. ఇంటర్వ్యూ 50 మార్కులకు నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100. ప్రాసెసింగ్‌ ఫీజు రూ.550, మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, ఎక్స్‌ సర్వీస్‌మన్‌లు రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు https://www.mha.gov.in/ విజిట్‌ చేయండి.

Next Story