నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. ఏపీ వాట‌ర్ రిసోర్స్‌ విభాగంలో ఖాళీలకు నోటిఫికేషన్

AP water resource department jobs notification.ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వాట‌ర్ రిసోర్స్ విభాగంలో ఖాళీగా ఉన్న 7 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 April 2021 6:18 AM GMT
water resource job notification

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నిరుద్యోగుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. వాట‌ర్ రిసోర్స్ విభాగంలో ఖాళీగా ఉన్న 7 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నెల 15 లోపు ధ‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది.

పోస్టుల వివరాలు : హైడ్రాలజిస్ట్‌–01, కెమిస్ట్‌ ఎక్స్‌పర్ట్‌–03, అకౌంటెంట్‌–01, డేటా ఎంట్రీ ఆపరేటర్‌–02.

హైడ్రాలజిస్ట్‌..

అర్హత : బీటెక్‌(సివిల్‌) ఉత్తీర్ణతతోపాటు హైడ్రాలజీ విభాగంలో రెండేళ్ల అనుభవం/ఎంటెక్‌(వాటర్‌ రిసోర్సెస్‌) ఉత్తీర్ణతతోపాటు హైడ్రాలజీలో ఏడాది అనుభవం ఉండాలి.

వేతనం: నెలకు రూ.56,000 చెల్లిస్తారు.

పని ప్రదేశం: చీఫ్‌ ఇంజనీర్, హైడ్రాలజీ, విజయవాడ.

కెమిస్ట్‌ ఎక్స్‌పర్ట్‌..

అర్హత : కెమిస్ట్రీలో బీఎస్సీ/ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల ల్యాబ్‌ అనుభవం ఉండాలి.

వేతనం : నెలకు రూ.24,500 చెల్లిస్తారు.

పని ప్రదేశం: కడప, గుంటూరు వాటర్‌ క్వాలిటీ ల్యాబ్స్‌.

అకౌంటెంట్‌..

అర్హత : ఎంకాం/బీకాం ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో రెండేళ్ల అనుభవం ఉండాలి.

వేతనం: నెలకు రూ.17,500 చెల్లిస్తారు.

పని ప్రదేశం: చీఫ్‌ ఇంజనీర్, హైడ్రాలజీ, విజయవాడ.

డేటాఎంట్రీ ఆపరేటర్‌..

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.

వేతనం: నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

పని ప్రదేశం: చీఫ్‌ ఇంజినీర్, హైడ్రాలజీ, విజయవాడ.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్‌: cehydrology@ap.gov.in


దరఖాస్తులకు చివరి తేది: 15.04.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://irrigationap.cgg.gov.in/wrd/home లాగిన్ అయి వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు.
Next Story