ఏపీ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్‌

AP Police SI halltickets for preliminary exam released. పోలీస్ కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ ప్రిలిమినరీ ఫలితాలను ఆదివారం విడుదల చేసిన

By అంజి  Published on  6 Feb 2023 12:45 PM IST
ఏపీ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్‌

పోలీస్ కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ ప్రిలిమినరీ ఫలితాలను ఆదివారం విడుదల చేసిన పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 19న నిర్వహించనున్న సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల ప్రిలిమినరీ పరీక్షకు హాల్ టికెట్‌లను విడుదల చేసింది. ఫిబ్రవరి 15 సాయంత్రం 5 గంటల వరకు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు షిఫ్ట్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు షిఫ్ట్-2తో రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు.

అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి హాల్ టిక్కెట్లు పొందవచ్చు. మరోవైపు, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఫలితాలను విడుదల చేసి APSLPRB వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా 4,59,182 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పరీక్షకు హాజరుకాగా, వారిలో 95,208 మంది అభ్యర్థులు ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్షలకు అర్హత సాధించారు. 6,100 పోస్టుల భర్తీకి గత నెల 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు.

Next Story