AP: గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వుల జారీ

వివిధ శాఖల్లో గ్రూప్-1, గ్రూప్-2 సర్వీసుల కింద ఖాళీగా ఉన్న 597 పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌ మెంట్‌ ద్వారా భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

By అంజి  Published on  29 Aug 2023 7:28 AM IST
Andhra Pradesh govt, Group I, Group II posts, job recruitment

AP: గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఉత్తర్వుల జారీ

అమరావతి: రాష్ట్రంలోని వివిధ శాఖల్లో గ్రూప్-1, గ్రూప్-2 సర్వీసుల కింద ఖాళీగా ఉన్న 597 పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌ మెంట్‌ ద్వారా భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 597 ఖాళీలలో, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-I కేటగిరీలో 89 ఖాళీలను భర్తీ చేస్తుంది, మిగిలిన 508 పోస్టులు గ్రూప్-II కేటగిరీకి చెందినవి. 597 పోస్టుల కోసం ఏపీపీఎస్‌సీ ద్వారా డిపార్ట్‌మెంట్ వారీగా, పోస్ట్‌ల వారీగా రిక్రూట్‌మెంట్ చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతించిందని ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి ఉత్తర్వుల్లో తెలిపారు.

గ్రూప్-1 సర్వీసుల కింద 12 మంది డిప్యూటీ కలెక్టర్లు, 18 మంది అసిస్టెంట్ కమిషనర్లు (సేల్స్ ట్యాక్స్), 26 సబ్-డివిజనల్ పోలీసు అధికారులను ఇతర పోస్టుల్లో నియమించాలని భావిస్తున్నారు. అదేవిధంగా గ్రూప్-2 కేటగిరీ కింద 161 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, 114 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 150 మంది ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్లను నియమించాలని భావిస్తున్నారు. దీంతో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఏపీపీఎస్‌సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

Next Story