ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS).. నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NORCET) ద్వారా 3500 కి పైగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి తేదీ. 18 నుంచి 30 ఏళ్ల లోపు వారు ఈ పోస్టులకు అర్హులు. rrp.aiimsexams.ac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలు, ఎక్స్ సర్వీస్‌మెన్లకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్‌ఎం డిప్లొమా పూర్తి చేసి రెండేళ్ల అనుభవం ఉన్నవారు అర్హులు.
సెప్టెంబర్ 14న ప్రిలిమినరీ, 27న మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ భారీ నియామక కార్యక్రమం కేవలం AIIMS కి మాత్రమే కాదు. ఇతర ప్రముఖ కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా ఉద్దేశించబడింది. దరఖాస్తు రుసుము జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు రూ.3000, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 2400, వికలాంగులకు రుసుము మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులు ధృవీకరించబడిన షెడ్యూల్, గడువుల కోసం అధికారిక AIIMS నియామక పోర్టల్‌ను తనిఖీ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.