ఈ నెల 15 నుంచి సూర్యాపేటలో రాష్ట్రస్థాయి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

Agnipath Scheme: Army recruitment rally for TS candidates to be held at Suryapet from Oct 15.అక్టోబ‌ర్ 15 నుంచి 31వ‌ర‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Oct 2022 7:50 AM GMT
ఈ నెల 15 నుంచి సూర్యాపేటలో రాష్ట్రస్థాయి ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

తెలంగాణ రాష్ట్రంలో అక్టోబ‌ర్ 15 నుంచి 31 వ‌ర‌కు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల మైదానంలో అగ్నిపథ్ పథకం కింద ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వ‌హిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల‌కు చెందిన అభ్య‌ర్థులు ఇందులో పాల్గొన‌వ‌చ్చు. సికింద్రాబాద్‌లోని ఆర్మీ రిక్రూట్‌మెంట్ కార్యాలయం ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరగనుంది.అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్ / స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.

సూర్యాపేటలో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా ర్యాలీ నోటిఫికేషన్‌లోని పేరా 23లో జాబితా చేయబడిన అన్ని పత్రాలను తీసుకురావాలి, వీటిని www.joinindianarmy.nic.inలో చూడవచ్చు.

నోటిఫికేషన్‌లో డాక్యుమెంట్ ఫార్మాట్‌లు కూడా ఉన్నాయి. పూర్తి పత్రాలు లేకుండా లేదా తప్పుడు ఫార్మాట్‌లో (ముఖ్యంగా అఫిడవిట్) ర్యాలీకి వచ్చే అభ్యర్థులు అనర్హులు.

Next Story