దేశంలో అతి పెద్ద బ్యాంక్ అయిన ఎస్‌బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా).. క్లర్క్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. తొలుత 13,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. ఆ తర్వాత 609 బ్యాక్లాగ్ జాబ్‌లను కూడా యాడ్ చేశారు. మొత్తంగా 13,344 జూనియర్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా తెలంగాణ సర్కిల్‌లో 342, ఆంధ్రాలో 50 ఖాళీలు ఉన్నాయి.
డిగ్రీ ఉత్తీర్ణులైన 20 నుంచి 28 ఏళ్లలోపు వారు జనవరి 7వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఎలాంటి ఫీజు ఉండదు. మిగతా అభ్యర్థులు రూ.750 చెల్లించాలి. ఫిబ్రవరిలో ప్రిలిమ్స్, మార్చి లేదా ఏప్రిల్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://sbi.co.in/ లో చూడొచ్చు.
అటు ఎస్‌బీఐలో 600 పీవో ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రాసెస్ డిసెంబర్ 27న మొదలైంది. అర్హతగల అభ్యర్థులు 2025 జనవరి 16 వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ పరీక్షలు మార్చి 8 నుంచి మార్చి 15 వరకు జరుగుతాయి. మెయిన్స్ ఎగ్జామ్స్ ఏప్రిల్ లేదా మె నెలల్లో నిర్వహిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.