ఎస్ఐ, కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల

84 Percentage Qualfied In SI And Police Constable Final Written Exams By TSLPRB. తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ నియామ‌క తుది పరీక్షల ఫలితాలు మంగ‌ళ‌వారం విడుదల అయ్యాయి.

By Medi Samrat  Published on  30 May 2023 1:13 PM GMT
ఎస్ఐ, కానిస్టేబుల్ తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్ నియామ‌క తుది పరీక్షల ఫలితాలు మంగ‌ళ‌వారం విడుదల అయ్యాయి. గత మార్చి, ఏప్రిల్ నెల‌ల్లో జ‌రిగిన మెయిన్స్‌ పరీక్షల ఫ‌లితాలు విడుద‌ల చేస్తున్న‌ట్లు టీఎస్ఎల్‌పీఆర్‌బీ నేడు ఓ ప్ర‌క‌ట‌న ద్వారా తెలిపింది. ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ప‌రీక్షల్లో 84.06 శాతం మంది అర్హత సాధించిన‌ట్లు వెల్లడించింది. ఎస్‌సీటీ పీసీ సివిల్, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు 98,218 మంది అర్హ‌త సాధించ‌గా.. ఎస్‌సీటీ ఎస్ఐ సివిల్ పోస్టుల‌కు 43,708 అర్హ‌త సాధించారు. ఎస్‌సీటీ పీసీ అండ్‌ ఐటీ అండ్ సీవో ఉద్యోగాల‌కు 4,564 మంది, ఎస్‌సీటీ ఎస్ఐ ఐటీ అండ్ సీవో పోస్టుల‌కు 729 మంది, ఎస్‌సీటీ పోలీసు కానిస్టేబుల్ డ్రైవ‌ర్, డ్రైవ‌ర్ ఆప‌రేట‌ర్ ఉద్యోగాల‌కు 1,779 మంది, ఎస్‌సీటీ ఏఎస్ఐ ఎఫ్‌పీబీ ఉద్యోగాల‌కు 1,153 మంది, ఎస్‌సీటీ ఎస్ఐ పీటీవో ఉద్యోగాల‌కు 463 మంది, ఎస్‌సీటీ పీసీ మెకానిక్ పోస్టుల‌కు 238 మంది అర్హ‌త సాధించిన‌ట్లు ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.

ఈ పోస్టుల‌కు సంబంధించి తుది రాత ప‌రీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను టీఎస్ఎల్‌పీఆర్‌బీ వెబ్‌సైట్‌లో మంగ‌ళ‌వారం రాత్రి నుంచి అందుబాటులో ఉంచ‌నున్నట్లు ప్ర‌క‌ట‌లో పేర్కొంది. ఫైన‌ల్ కీ, ఓఎంఆర్ షీట్లు వెబ్‌సైట్‌లో చూసుకోవ‌చ్చు. రీకౌంటింగ్, రీ వెరిఫికేష‌న్‌కు అవకాశం క‌ల్పించారు. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్య‌ర్థులు రూ. 2 వేలు, ఇత‌ర క‌మ్యూనిటీలు, నాన్ లోకల్ అభ్య‌ర్థులు రూ. 3 వేలు చెల్లించి రీ కౌంటింగ్, రీవెరిఫికేష‌న్ చేసుకోవ‌చ్చ‌ని సూచించారు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేష‌న్ ప్ర‌క్రియ జూన్ 1వ తేదీ ఉద‌యం 8 గంట‌ల నుంచి జూన్ 3వ తేదీ రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు అందుబాటులో ఉంటుంది.


Next Story