తెలంగాణ హైకోర్టుకు అద‌నంగా 779 పోస్టుల మంజూరు

779 Posts sanctioned in Telangana High Court.తెలంగాణ రాష్ట్ర‌ హైకోర్టులో వివిధ క్యాటగిరీలకు చెందిన ఉద్యోగాల భర్తీకి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 April 2022 3:43 AM GMT
తెలంగాణ హైకోర్టుకు అద‌నంగా 779 పోస్టుల మంజూరు

తెలంగాణ రాష్ట్ర‌ హైకోర్టులో వివిధ క్యాటగిరీలకు చెందిన ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు 779 అద‌న‌పు పోస్టుల‌కు మంజూరు ఇస్తూ ఆర్థికశాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.

మంజూరైన పోస్టుల వివ‌రాలు ఇలా..

రిజిస్ట్రార్‌ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌) 1, జాయింట్‌ రిజిస్ట్రార్ 3, డిప్యూటీ రిజిస్ట్రార్ 5, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ 4, సెక్షన్‌ ఆఫీసర్స్‌/స్క్రూటినీ ఆఫీసర్స్‌ 96, కోర్టు మాస్టర్స్‌/పీఎస్‌ టు జడ్జెస్‌ 59, డిప్యూటీ సెక్షన్‌ ఆఫీసర్స్‌/ట్రాన్స్‌లేటర్‌ 78, కంప్యూటర్‌ ఆపరేటర్‌ 12, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ 73, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ 1, యూ.డీ. స్టెనో 1, అసిస్టెంట్స్‌ 72, రీడర్స్‌ అండ్‌ ఎగ్జామినర్స్‌ 22, టైపిస్ట్‌ 24, కాపీయిస్ట్‌ 24, డ్రైవర్‌ 55, బైండర్‌ 1, బుక్‌-బేరర్‌ 1, కాపియర్ మిషిన్‌ ఆపరేటర్‌ 1, రికార్డు అసిస్టెంట్‌ 27, లిఫ్ట్‌ ఆపరేటర్‌ 5, ఆఫీస్‌ కోఆర్డినేటర్‌ 181, సూపరింటెండెంట్‌ ఇంజినీర్ 4, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్ 1, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (సివిల్‌) 2, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌) 1, సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌ క్యాడర్ 1 ఇలా మొత్తం 779 పోస్టులు ఉన్నాయి.

Next Story