నిరుద్యోగ అభ్యర్థులకు భారతీయ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా అన్ని రైల్వో జోన్లలో మొత్తం 5,810 ఖాళీలను భర్తీ చేసేందుకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (గ్రాడ్యుయేట్)లో పోస్టులు ఉన్నాయి. ఈ కేటగిరిలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
అక్టోబర్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. నవంబర్ 20వ తేదీన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరి అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, ఈబీసీ, దివ్యాంగులు, మహిళలా అభ్యర్థులకు రూ.250 దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
అభ్యర్థుల వయోపరిమితి 01-01-2026 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన ఈ పోస్టులకు అర్హులకు. కంప్యూటర్‌లో ఇంగ్లీష్ లేదా హిందీలో టైపింగ్ ప్రావీణ్యం తప్పనిసరి.