నిరుద్యోగులకు శుభవార్త.. పోస్ట్ ఆఫీసుల్లో 38926 ఉద్యోగాలు
38926 Vacancies for Gramin Dak Sevak Across India.ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త.
By తోట వంశీ కుమార్ Published on 4 May 2022 5:01 AM GMTప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ఇండియా పోస్ట్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో 38,926 పోస్టులను భర్తీ చేయనుంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ఏబీపీఎం),డాక్ సేవక్ ఇందులో ఉన్నాయి. పదో తరగతి పాసైన వారు దరఖాస్తు చేసుకునేందుకు ఇందుకు అర్హులు. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 2,942 పోస్టులు ఉన్నాయి. ఇందులో తెలంగాణలో 1,226, ఆంధ్రప్రదేశ్‌లో 1,716 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.https://indiapostgdsonline.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అప్లై చేయడానికి జూన్ 5, 2022 చివరి తేదీ.
మొత్తం పోస్టుల సంఖ్య: 38926
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు : తెలంగాణలో–1226, ఆంధ్రప్రదేశ్‌లో–1716
పోస్టుల వివరాలు: బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ఏబీపీఎం),డాక్ సేవక్.
అర్హతలు: పదో తరగతి పాసై ఉండాలి. పదో తరగతిలో గణితం మరియు ఇంగ్లీషు తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉండాలి. స్థానిక భాషపై అవగాహన ఉండాలి. సైకిల్ తొక్కడం తెలిసి ఉండాలి.
వయో పరిమితి: అభ్యర్థుల వయోపరిమితి 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు సమర్పించే చివరి తేదీ నాటికి వయస్సు నిర్ణయించబడుతుంది. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: మహిళలు, SC/ST అభ్యర్థులు, వికలాంగులకు ఫీజు లేదు. మిగిలిన వారు రూ.100 చెల్లించాలి.
ఎంపిక విధానం : పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ప్రకారం తుది ఎంపిక జరుగుతుంది.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.05.2022
దరఖాస్తులకు చివరి తేది: 05.06.2022
వెబ్‌సైట్: https://indiapostgdsonline.gov.in