నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కేంద్ర హోంశాఖలో 3,717 పోస్టులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

కేంద్ర హోంశాఖ పరిధిలో 3,717 ఇంటెలిజెన్స్‌ బ్యూరో.. అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

By అంజి
Published on : 20 July 2025 6:50 PM IST

3717 Posts, Intelligence Bureau, IB,  Recruitment,Assistant Central Intelligence Officer

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కేంద్ర హోంశాఖలో 3,717 పోస్టులు

కేంద్ర హోంశాఖ పరిధిలో 3,717 ఇంటెలిజెన్స్‌ బ్యూరో.. అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 10 వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్‌ అయిన వారు ఈ పోస్టులకు అర్హులు. అప్లికేషన్‌ ఫీజు జనరల్‌, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.650. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రూ.550. ఆబ్జెక్టివ్‌, డిస్క్రిప్టివ్‌, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం WWW.mha.gov.in ను విజిట్‌ చేయండి.

మొత్తం పోస్టులు 3,717 కాగా.. అందులో జనరల్ పోస్టులు 1537, ఈడబ్ల్యూఎస్‌ 442, ఓబీసీ 946, ఎస్సీ 556, ఎస్టీకి 226 పోస్టులు కేటాయించారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుండి ఏదైనా గ్రాడ్యుయేట్ దరఖాస్తు చేసుకోవచ్చు. వయోపరిమితి (10.08.2025 నాటికి).. 18 సంవత్సరాలుపైన ఉన్నారు.. 27 సంవత్సరాల లోపు ఉన్న వారు అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు 10 ఆగస్టు 2025 లోపు ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారు భారత్‌లో ఎక్కడ పోస్టింగ్‌ ఇస్తే.. అక్కడ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.

Next Story