కేంద్ర ప్రభుత్వంలోని హోంమంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటలిజెన్స్ బ్యూరోలో 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-ii/ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. అర్హత గల అభ్యర్థులను వెంటనే ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోండి. కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే చేయాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయిన వారు ఈ పోస్టులకు అర్హులు. అప్లికేషన్ ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.650. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రూ.550. ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాల కోసం WWW.mha.gov.in లేదా WWW.ncs.gov.inను విజిట్ చేయండి. మొత్తం పోస్టులు 3,717 కాగా.. అందులో జనరల్ పోస్టులు 1537, ఈడబ్ల్యూఎస్ 442, ఓబీసీ 946, ఎస్సీ 556, ఎస్టీకి 226 పోస్టులు కేటాయించారు. వయస్సు 18 సంవత్సరాలుపైన ఉన్నారు.. 27 సంవత్సరాల లోపు ఉన్న వారు అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది. ఎంపికైన వారు భారత్‌లో ఎక్కడ పోస్టింగ్ ఇస్తే.. అక్కడ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. వేతనం రూ.44,900 నుండి రూ.1,42,000 వరకు ఉంటుంది.