13,217 పోస్టులు.. దరఖాస్తుకు ఇంకా 3 రోజులే సమయం

ఐబీపీఎస్‌ గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఆఫీసర్స్‌ (స్కేల్‌ 1, 2,3) ఆఫీస్‌ అసిస్టెంట్స్‌ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇంకామూడు...

By -  అంజి
Published on : 19 Sept 2025 7:52 AM IST

IBPS posts, Grameen Bank, Jobs, IBPS

13,217 పోస్టులు.. దరఖాస్తుకు ఇంకా 3 రోజులే సమయం

ఐబీపీఎస్‌ గ్రామీణ బ్యాంకుల్లో 13,217 ఆఫీసర్స్‌ (స్కేల్‌ 1, 2,3) ఆఫీస్‌ అసిస్టెంట్స్‌ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇంకామూడు రోజులే (సెప్టెంబర్‌ 21) ఉంది. ఆసక్తిగల, ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు, ప్రొవిజినల్‌ అలాట్‌మెంట్‌ ద్వారా ఈ నియామకం జరుగుతుంది. ఏదైనా డిగ్రీ (కొన్ని పోస్టులకు స్పెషలైజ్డ్‌ డిగ్రీ అవసరం) ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థుల వయోపరిమితి సెప్టెంబర్‌ 1 నాటికి ఆఫీస్‌ అసిస్టెంట్లకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య, ఆఫీసర్‌ స్కేల్‌ 1 పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య, ఆఫీసర్‌ స్కేల్‌ 2 పోస్టులకు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య, ఆఫీసర్‌ స్కేల్‌ 3 పోస్టులకు 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వారికి రూ.175, మిగతా వారికి రూ.850.

ప్రాథమిక పరీక్షలు నవంబర్‌ లేదా డిసెంబర్‌లో, ప్రధాన పరీక్షలు డిసెంబర్‌లో లేదా ఫిబ్రవరి 2026లో నిర్వహించబడతాయి. ఆఫీసర్స్‌ పోస్టుల ఇంటర్వ్యూలు జనవరి - ఫిబ్రవరి 2026లో జరుగుతాయి. తుది ఫలితాలు, ప్రొవిజినల్‌ అలాట్‌మెంట్‌ ఫిబ్రవరి లేదా మార్చి 2026లో ప్రకటించబడతాయి. పూర్తి వివరాలకు www.ibps.in ను విజిట్‌ చేయండి.

Next Story