సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపికబురు అందించింది. పీజీ డిప్లోమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఆసక్తిగల వారు ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-1క్రెడిట్ ఆఫీసర్ హోదా ఉద్యోగం లభించనుంది. డిగ్రీ అర్హత గల అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 60 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.
అభ్యర్థుల వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు కలదు. దరఖాస్తు ఫీజు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ కోర్సులో దేశ వ్యాప్తంగా ఖాళీలున్నాయి. కోర్సు వ్యవధి ఏడాది. అభ్యర్థులు చదువు, వసతి వంటి వాటికి కలిపి రూ.3 నుంచి 4 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైన వారికి బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది.
బ్యాంకులో ఐదేళ్లు కొనసాగితే చెల్లించిన కోర్సు ఫీజు మొత్తం తిరిగి చెల్లిస్తారు. కోర్సులో చేరిన వారికి వివిధ ప్రాంతీయ కేంద్రాల్లో శిక్షణ ఉంటుంది. ఆ సమయంలో నెలకు రూ.2500 చొప్పున 9 నెలల పాటు అందిస్తారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ సమయంలో రూ.10 వేల చొప్పున 3 నెలలు అందిస్తారు. కోర్సు పూర్తైన తర్వాత ఉద్యోగంలో చేరితే మొదటి నెల రూ.48,480 జీతం, ఇతర అలవెన్సులు ఇస్తారు.