ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల జాతర
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 29 Oct 2019 12:45 PM IST

అమరావతి: రాష్ట్ర నిరుద్యోగులకు వైసీపీ ప్రభుత్వం మరో శుభవార్తను అందించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగుల కోసం ప్రభుత్వం మరో నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. 44,941 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పోలీసులు-13,591 పోస్టులు, డి.ఎస్.పీ- 20,000 పోస్టులు, గ్రూప్-II-1,000 పోస్టులు, గ్రూప్-IV-2,600 పోస్టులు, అటవీశాఖ- 2,750 పోస్టులు, ఇతరులు- 5,000 పోస్టులు కాగా మొత్తం 44,941ల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా ఊపనుంది. దీనికి 18 నుంచి 30 సంవత్సరాల వయస్సు ఉన్న వారు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. పే స్కేల్ నెలకు రూ.28,100. క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ: 30-జనవరి-2020
Next Story