జియోలో ముబాదల భారీగా పెట్టుబడులు

By సుభాష్  Published on  5 Jun 2020 11:03 AM IST
జియోలో ముబాదల భారీగా పెట్టుబడులు

టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో సంచలనం సృష్టిస్తోంది. కరోనా విపత్కర సమయంలో కూడా భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఆరు వారాల్లో డీల్‌ కుదుర్చుకుంది. తాజాగా అబుదాబికి చెందిన ముబాదల ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ.. జియోలో భారీగా పెట్టుబడి పెట్టింది. ఆ కంపెనీ జియో ప్లాట్‌ ఫాంలో రూ. 9093 కోట్ల పెట్టుబడులు జియో పెట్టింది. జియోలో 1.85 శాతం వాటా. ఇటీవల జియోలో పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ కంపెనీలు సైతం ఎంతో ఆసక్తి చూపుతున్నారు. జియోలోవాటా కొనుగోలు చేసిన ఆరో కంపెనీగా ముబాదల నిలిచింది.

జియోలోఇప్పటి వరకూ జనరల్‌ అట్లాంటిక్‌, ఫేస్‌బుక్‌, సిల్వర్‌ లేక్‌ పార్టనర్స్‌, కేకేఆర్‌, విస్టా ఈక్విటీ పార్ట్‌ నర్స్‌ వంటి పెద్ద పెద్ద సంస్థలు పెట్టాయి. జనరల్‌ అట్లాంటిక్‌ 6,598.38 కోట్లు, ఫేస్‌ బుక్‌ సంస్థ 43,574 కోట్లు, సిల్వర్‌ లేక్‌ కంపెనీ 5,655.75 కోట్లు, కేకేఆర్‌ జనరల్‌ అట్లాంటిక్‌ రూ. 11,367 కోట్లు, విస్టా ఈక్విటి రూ.11,367 కోట్లు, ఇక ముబాదల కంపెనీ వద్ద సుమారు 229 మిలియన్ల డాలర్లు ఆస్తులున్నాయి. 50 దేశాల్లో ఆ కంపెనీ పెట్టుబడులున్నాయి. ఈ ముబాదల ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీలో 2017లో మొదలు పెట్టింది.

Next Story