ఝార్ఖండ్‌లో పోలింగ్‌ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే.. నక్సల్స్‌ ఘాతుకానికి పాల్పడ్డారు. గుల్మా జిల్లాలోని విష్ణుపూర్‌లోని ఓ వంతెనను పేల్చివేశారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. పోలీసు ఉన్నతాధికారి శశి రంజన్‌ తెలిపారు. అంతే కాకుండా పోలింగ్‌కు ఎలాంటి అంతరాయం కలగలేదని వెల్లడించారు. ప్రజలు పోలింగ్‌ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నట్లు సమాచారం.

అయితే ఝార్ఖండ్‌లో మొత్తం ఆరు జిల్లాల్లో 13 నియోజవర్గాల్లో పోలింగ్‌ కోనసాగుతుంది. ఈ నేపథ్యలో పేలుడు సంభవించటంతో.. పోలీసు బలగాలు మరింత అలర్ట్‌ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అలాగే ఓటర్లంతా తమ హక్కుని వినియోగించుకొవాలని.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువర్‌ దాస్‌ పిలుపునిచ్చారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.