కొనసాగుతున్న తుది దశ పోలింగ్.. భద్రత కట్టుదిట్టం
By సుభాష్ Published on 20 Dec 2019 8:27 AM ISTజార్ఖండ్ అసెంబ్లీకి ఈ రోజు తుది దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 16 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 40,05,287 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. తుది దశ పోలింగ్ సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమై మధ్యాహ్నం 3గంటలకు ముగియనుంది. పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, జర్ఖండ్ మాజీ సీఎం జేఎంఎం ప్రముఖ నేత హేమంత్ సోరెన్, మరో ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు ఐదు విడుదలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 16 వరకు నాలుగు విడుదలుగా పోలింగ్ జరుగగా, ఈ రోజు తుది విడుదల పోలింగ్ కొనసాగుతోంది. ఫలితాలు ఈనెల 23న వెలువడనున్నాయి. ఇక చివరి దిశ పోలింగ్ ఉండటంతో , ఫలితాల సమయం దగ్గరపడుతుండటంతో నాయకుల్లో టెన్షన్ మొదలైంది.