బీజేపీకి షాకిచ్చిన ఎన్నికల ఫలితాలు..!
By Newsmeter.Network Published on 23 Dec 2019 6:05 PM ISTజార్ఖండ్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. బీజేపీపై ప్రజలకు నమ్మకం పోయిందని ఎన్సీపీ,శివసేనలు వ్యాఖ్యనించాయి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. కాగా, మోదీ, అమిత్ షాలకు జార్ఖండ్ ఓటర్లు గర్వభంగం చేశారని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజాస్వామ్యం గెలిచిందని ఆయన ట్విట్ చేశారు. మోదీ, అమిత్ షాలు ఎంత కష్టపడినప్పటికీ జార్ఖండ్‌లో బీజేపీ తన అధికారాన్ని కోల్పో వల్సి వచ్చిందన్నారు. మహారాష్ట్రలో అధికారాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమైందని, బీజేపీపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని శివసేన అధికారి ప్రతినిధి మనీష్ కయాండే వ్యాఖ్యనించారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాల్లో తాజాగా జేఎంఎం, కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి 46 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచిందన్నారు. 24 స్థానాల్లో బీజేపీ రెండో స్థానానికి పరిమితమైంది.
ఈ ఏడాదిలో ఐదు కీలక రాష్ట్రాలో బీజేపీ నుంచి చేజారిపోవడంతో కాషాయదళంలో టెన్షన్ మొదలైంది. శివరాజ్‌సింగ్ చౌహాన్, రమణ్‌సింగ్, దేవేంద్రపడ్నావీస్, వసుంధరారాజే, రఘుబర్‌దాస్ లాంటి బలమున్న నేతలు పరాజయం చెందాల్సి వచ్చింది. దీంతో బీజేపీకి కలవరపాటు మొదలైందనే చెప్పాలి. ఇక త్వరలో ఢిల్లీ, పశ్చిమబెంగాల్ కు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి పెద్ద సవాలుగా మారిందనే చెప్పాలి. ఇక ఎన్నికల్లో ముందుకెళ్లేందుకు తగిన వ్యూహాలు రచించాల్సిన అవసరం బీజేపీకి ఎంతైనా ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.