జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సీఈసీ
By న్యూస్‌మీటర్ తెలుగుPublished on : 1 Nov 2019 5:58 PM IST

ఢిల్లీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో జార్ఖండ్ లో ఎన్నికల నగారా మోగింది. మొత్తం 81 అసెంబ్లీ స్ధానాలకు ఐదు దశల్లో పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 6న నోటిఫికేషన్ జారీ అవుతుంది. నవంబర్ 30న తొలి దశ పోలింగ్, డిసెంబర్ 7న రెండో దశ, డిసెంబర్ 12న మూడో దశ, డిసెంబర్ 16న నాలుగో దశ, డిసెంబర్ 20న ఐదో దశ పోలింగ్ ఉంటుందని ఈసీ వెల్లడించింది. ఇక వచ్చేఏడాది జనవరి 5తో ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి ముగియనుంది.డిసెంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. సీఈసీ సునీల్ అరోరా, ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.
Next Story