రూ.7 కోట్ల అభరణాల చోరీ కేసులో కానిస్టేబుల్‌ అరెస్ట్‌

By సుభాష్  Published on  4 May 2020 9:25 AM GMT
రూ.7 కోట్ల అభరణాల చోరీ కేసులో కానిస్టేబుల్‌ అరెస్ట్‌

ముంబైలో ఏప్రిల్‌ 22వ తేదీన జరిగిన రూ.7 కోట్ల విలువ చేసే అభరణల చోరీ కేసులో సంతోష్‌ రాథోడ్‌ అనే కానిస్టేబుల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన నుంచి రూ. 80 లక్షల విలువ చేసే నగలను స్వాధీనం చేసుకున్నారు.ఓషివారా పోలీస్‌ స్టేషన్‌కు ఆయనను ఈ నెల 6వ తేదీ వరకూ రిమాండ్‌కు తరలించారు. రాథోడ్‌తోపాటు పంకజ్‌ రామ్‌లీవర్‌ అనే వ్యక్తిని కూడా అరెస్టు చేశారు. ఈ నగల దుకాణం ఉన్న హౌసింగ్‌ సొసైటీలో పంకజ్‌ స్వీపర్‌గా పని చేస్తున్నాడు.

కాఆ, ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నగరంలోని ఓ ఎన్జీవో అధ్యక్షుడు విపుల్‌ ఆనంద చంద్రబియతోపాటు మరో ఆరుగురిని అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ.5.30 కోట్ల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నారు.

Next Story
Share it