భార‌త మ‌హిళా క్రికెట‌ర్‌కు ఆ పాక్ ఆట‌గాడు అంటే ఇష్టమ‌ట‌..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 April 2020 3:06 PM GMT
భార‌త మ‌హిళా క్రికెట‌ర్‌కు ఆ పాక్ ఆట‌గాడు అంటే ఇష్టమ‌ట‌..

భార‌త మ‌హిళా క్రికెట‌ర్ జెమీమా రోడిగ్స్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌కు క్రికెట్‌లో ఇష్ట‌మైన షాట్ ఏది అన‌గా.. క‌వ‌ర్ డ్రైవ్ అంటూ చెప్పింది. ఈ షాట్‌ను ఎవ‌రు బాగా ఆడ‌తారు అని అడ‌గ‌గా.. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ బాబ‌ర్ ఆజామ్ అంటూ చెప్పింది. అంతేకాదు .. ఆజామ్ క‌వ‌ర్ డ్రైవ్స్ అంటే త‌న‌కెంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చింది.

క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు క్రీడారంగం కుదేలైంది. అన్ని క్రీడ‌లు వాయిదా ప‌డ‌డంతో క్రీడాకారులంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. చాలా మంది క్రీడాకారులు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అభిమానుల‌తో లైవ్‌లో ముచ్చ‌టిస్తున్నారు. తాజాగా భార‌త మ‌హిళ క్రికెట‌ర్ జెమీమా రోడిగ్స్‌.. న‌టి, మోడ‌ల్ రిధిమా ప‌తక్‌తో క‌లిసి ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో పాల్గొంది. అభిమానులు అడిగిన ప‌లుప‌శ్న‌ల‌కు త‌న‌దైన శైలిలో స‌మాధాన మిచ్చింది.

క్రికెట్‌లో జెమీమాకు ఇష్ట‌మైన షాట్ ఏదీ అంటూ ఓ అభిమాని ప్ర‌శ్నించాడు. క‌వ‌ర్ డ్రైవ్ అంటూ స‌మాధాన మిచ్చింది. మ‌రీ ఈ షాట్‌ను మీ దృష్టిలో ఎవ‌రు బాగా ఆడ‌తారు అని మ‌రో ప్ర‌శ్న వేయ‌గా.. పాకిస్థాన్‌కు చెందిన బాబ‌ర్ ఆజామ్ ఈ షాట్‌ను బాగా ఆడ‌తాడ‌ని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. త‌న‌కు బాబ‌ర్ ఆజామ్ క‌వ‌ర్ డ్రైవ్ షాట్స్ చూడ‌డం అంటే చాలా ఇష్టం అని చెప్పింది.

కాగా.. ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన టీ20 వ‌ర్డ‌ల్ క‌ప్ లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఫైన‌ల్ లో ఓట‌మి పాలైన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ టోర్నీలో జెమిమా రోడిగ్స్ ఆశించిన రీతిలో రాణించ‌లేదు.

Next Story
Share it