ఆ వార్త నిజం కాదు.. రాజశేఖర్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన జీవిత
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 4 Nov 2020 5:05 AM GMT
సీనియర్ నటుడు రాజశేఖర్ కరోనా బారిన పడి హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన వెంటిలేటర్ మీద ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేఫథ్యంలో రాజశేఖర్ ఆరోగ్యంపై ఆయన భార్య జీవిత తాజాగా స్పందించారు.
రాజశేఖర్ ఆరోగ్యం పరిస్థితి మెరుగుపడుతోందని.. ఆయన త్వరగా కోలుకుంటున్నారని జీవిత తెలిపారు. సిటీ న్యూరో సెంటర్ వైద్యులు చాలా కేరింగ్ తీసుకున్నారని. అందువల్ల రాజశేఖర్ గారు విషమ పరిస్థితి నుంచి బయటపడ్డారని ఆమె వివరించారు. త్వరలోనే రాజశేఖర్ ఐసీయూ నుంచి బయటకు వచ్చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అయితే.. రాజశేఖర్ వెంటిలేటర్ మీద ఉన్నారని ఓ వార్త ప్రచారం అవుతోందని. అది నిజం కాదని అన్నారు. ఆయన ఎప్పుడూ వెంటిలేటర్ మీద లేరని.. నిజానికి ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించిందని.. అయితే వెంటిలేటర్ మీద మాత్రం లేరని స్పష్టం చేశారు.
వైద్యులు నాన్ ఇన్‌వాసివ్ వెంటిలేటర్ సాయంతో రాజశేఖర్‌కు ఆక్సిజన్ అందించారని.. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఆక్సిజన్ సపోర్ట్ తగ్గిస్తూ చికిత్స చేస్తున్నారని తెలిపారు. రాజశేఖర్ ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థనలు చేసిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, సహనటులు, అభిమానులు అందరికి జీవిత ధన్యవాదలు తెలిపారు.