జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు.. దరఖాస్తులకు ఆరు రోజులే గడువు
By అంజి Published on 7 March 2020 8:38 AM GMTహైదరాబాద్: మార్చి 17వ తేదీన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ను ఐఐటీ ఢిల్లీ ఓ ప్రకటనలో విడుదల చేసింది. మే 1 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. కాగా అడ్వాన్స్డ్ అప్లికేషన్స్‌ను ఆరు రోజులే స్వీకరించేలా జేఈఈ నిర్వహణ సంస్థ షెడ్యూల్‌ను రూపొందించింది.
ఐఐటీల్లో బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్‌తో పాటు పలు కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం ఈ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహిస్తారు.
వచ్చె నెల 1 నుంచి 6వ తేదీ సాయంత్రం 5 గంటలకు వరకు ఆన్‌లైన్‌లో జేఈఈ పరీక్షలకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని జేఈఈ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ బులిటెన్‌లో ఉంచింది. ఫీజు చెల్లింపుకు 7వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. మార్చి 12 నుంచి జేఈఈ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మే 17వ తేదీన అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహించనున్నారు. జూన్ 8న పరీక్షల ఫలితాలను వెల్లడించనున్నారు. ఒకే రోజు రెండు పేపర్ల పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్ంర 5.30 గంటలవరకు పేపర్-2 పరీక్ష జరుగుతుంది.
అయితే ఈ సారి జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్‌కు అర్హులుగా తీసుకోనున్నారు.
కాగా 2020-21 విద్యా సంవత్సరానికి గాను 20 శాతం సూపర్ న్యూమరీ సీట్లను మహిళలకు కేటాయించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇక ఓపెన్ కేటగిరిలో 1,01,250 మందిని, ఈడబ్లయఎస్లో 25 వేల మందిని, ఎస్టీల్లో 18,750 మందిని, ఎస్సీల్లో 37,500 మందిని, ఓబీసీ నాన్ క్రీమీలేయర్లో 67,500 మందిని పరిగణనలోకి తీసుకోనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్, నిజమాబాద్, వరంగల్‌లో జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలను నిర్వహించనున్నారు.
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను చూసేందుకు jeeadv.ac.in లింక్‌ను క్లిక్ చేయండి.