మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరెస్టు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Jun 2020 2:43 AM GMT
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి అరెస్టు

తాడిపత్రి మాజి ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌ రెడ్డి లను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌ శివారులోని శంషాబాద్‌లో ఇద్దరిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ధ్రువపత్రాలతో బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించారన్న రవాణాశాఖ అధికారుల ఆరోపణలపై వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తం 154 లారీలను ఇలా అక్రమంగా వీరు రిజిస్ట్రేషన్ చేయించినట్టు అధికారులు పేర్కొన్నారు. వీరిని హైదరాబాద్‌ నుంచి అనంతపురానికి తరలిస్తున్నారు. నిన్న మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని ఈఎస్‌ఐ స్కామ్‌లో ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Next Story
Share it