ర‌విశాస్త్రి రూమ్‌లో దాక్కొన్నాడు.. పూల్‌లో తోసేశాం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 April 2020 4:32 PM GMT
ర‌విశాస్త్రి రూమ్‌లో దాక్కొన్నాడు.. పూల్‌లో తోసేశాం

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ బుధ‌వారం ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని పంచుకున్నాడు. ఓ యూట్యూబ్‌ వీడియోలో మాట్లాడుతూ.. ఓ పాత‌ మధుర జ్ఞాపకాన్ని నెమరేసుకున్నాడు. 1987లో ఇండియాలో క్రికెట్ ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట‌ర్‌లు వ‌చ్చారు. అప్పుడు భార‌త ఆట‌గాళ్ల‌తో క‌లిసి హోలీ ఆడిన‌ట్లు వెల్ల‌డించాడు.

"ఆ ప‌ర్య‌ట‌న‌లో బెంగుళూరులో ఓ టెస్టు మ్యాచ్ ఆడాం. ఆ టెస్టు మ్యాచ్ అప్పుడు భార‌త్‌, పాక్ ఆట‌గాళ్లు ఒకే హోట‌ల్‌లో బ‌స చేశాం. ప్ర‌తి రోజు సాయంత్రం భార‌త క్రికెట‌ర్లు, పాక్ క్రికెట్ల‌ర్లు క‌లిసి ఒకే చోటుకు వ‌చ్చి స‌ర‌దాగా మాట్లాడుకునే వాళ్లం. అప్పుడు హోలీ సీజ‌న్ కావ‌డంతో హెట‌ల్‌లోని వారు హోలీ ఆడేవారు. నాకు ఇంకా గుర్తింది. మేమంతా క‌లిసి ఇమ్రాన్ ఖాన్ రూంలోకి వెళ్లి రంగులు ఒక‌రిపై ఒక‌రం చ‌ల్లుకున్నాం. భార‌త క్రికెట‌ర్ల‌ను కూడా మేము వ‌ద‌ల్లేదు. వారిపై కూడా రంగులు చ‌ల్లాం. వారు కూడా మాకు ఎలాంటి అడ్డు చెప్ప‌లేద‌ని" మియాందాద్ తెలిపాడు.

అప్పుడు.. టీమ్ఇండియా ప్ర‌స్తుత కోచ్, అప్ప‌టి భార‌త ఆట‌గాడైన ర‌విశాస్త్రి ఓ రూంలో దాక్కొన్నాడు. ఈ విష‌యాన్ని గుర్తించి మేమంతా అక్క‌డి వెళ్లి ర‌విశాస్త్రిని ఎత్తుకొచ్చి స్విమ్మింగ్ పూల్‌లో ప‌డేశామ‌ని చెప్పాడు. ఆ టూర్ ను చాలా బాగా ఎంజాయ్ చేశామ‌ని, ఎప్ప‌టికి ఆ టూర్ ను మ‌ర్చిపోలేమ‌న్నాడు. ప్రతి ఒక్కరూ ఇతర మతాల పండగల్లో పాలు పంచుకోవాలని, హోలీ పండగను మేమంతా కలిసి చేసుకున్నాం. ఒకరి పండగల్లో మరొకరు పాలుపంచుకోవడంలో తప్పులేదు' అని మియాందాద్ అన్నాడు.

Next Story