క‌రీనా, ప్రియాంక‌ ఇష్టం..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  15 April 2020 2:22 PM GMT
క‌రీనా, ప్రియాంక‌ ఇష్టం..

మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ ముప్పు కార‌ణంగా ప‌లు క్రీడా టోర్నీలు వాయిదా ప‌డ‌గా.. కొన్ని ర‌ద్దు అయ్యాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ‌లో భాగంగా చాలా దేశాలు లాక్‌డౌన్‌ను విధించాయి. దీంతో క్రీడాకారులు ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. ఎప్పుడు బీజిగా ఉండే భార‌త క్రికెట‌ర్లు క‌రోనా సెల‌వుల‌ను త‌మ కుటుంబ సభ్యుల‌తో క‌లిసి హాయిగా గ‌డుపుతున్నారు. సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటున్నారు. లాక్‌డౌన్ కాలంలో తాము చేసే ప‌నుల‌ను సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకుంటున్నారు.

తాజాగా భార‌త ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌ర్‌, మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్య‌ర్ క‌లిసి ఇన్‌స్టాగ్రామ్ లో లైవ్ చాట్‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా టీమ్ఇండియా ఓపెన‌ర్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించాడు. ఇక క్రికెట్‌లో ఎవ‌రి బౌలింగ్‌లో ప‌రుగులు చేయ‌డానికి ఇబ్బంది పడ్డావ్ అని శ్రేయాస్.. శిఖ‌ర్ ధావ‌న్‌ను ప్ర‌శ్నించాడు. దీనికి శిఖ‌ర్ ధావ‌న్ స్పందిస్తూ త‌న కెరీర్ లో ద‌క్షిణాఫ్రికా ఫాస్ట్ బౌల‌ర్ డేల్ స్టెయిన్ బౌలింగ్‌లో ఇబ్బందులు ప‌డ్డాన‌ని తెలిపాడు. స్టెయిన్ ఓ అత్యుత్త‌మ బౌల‌ర్ అని పేర్కొన్నాడు. ఇక గ‌తేడాది ఆస్ట్రేలియా పై చేసిన సెంచ‌రీ త‌నకు ఎంతో ప్ర‌త్యేక‌మ‌ని తెలిపాడు. ఓ వైపు చేతి గాయం బాదిస్తున్నా.. జ‌ట్టుకోసం పోరాడి సెంచ‌రీ సాధించాన‌ని గుర్తు చేసుకున్నాడు. అందుకే త‌న కెరీర్‌లో ఆ శ‌త‌కం ఎంతో ప్ర‌త్యేక‌మైంద‌ని పేర్కొన్నాడు.

బాలీవుడ్ హీరోయిన్ల‌లో.. ఇష్ట‌మైన క‌థానాయిక ఎవ‌రు అడిన మ‌రో ప్ర‌శ్న‌కు ప్రియాంక చోప్రా, క‌రీనా క‌పూర్ అని స‌మాధాన మిచ్చాడు గ‌బ్బ‌ర్‌. అమీర్ ఖాన్ ఇష్ట‌మైన హీరో అని, ఖాళీ సమ‌యం దొరికితే.. సినిమాలు చూస్తాన‌ని తెలిపాడు. సంగీతం అంటే ఎంతో మ‌న్న ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ అయ్య‌ర్ కోరిక మేర‌కు లైవ్‌లో ప్లూట్ (పిల్ల‌న‌గ్రోవి) వాయించాడు. ఏదైన కొత్త‌గా నేర్చుకోవాల‌నుకునే వారికి ఈ లాక్‌డౌన్ ఎంత‌గానే ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని తెలిపాడు.

Next Story